
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లాలో వరుసగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులపై ఎలుకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కరీంనగర్ రోడ్ లోని సైదాపూర్ గురుకుల పాఠశాల వీణవంక గురుకుల పాఠశాలలో జరగగా అనంతరం శంకరపట్నం గురుకుల పాఠశాలలో సైతం ఎలకల దాడులకు విద్యార్థులు బలయ్యారు. ఈ సంఘటనలు మరవక ముందే మళ్లీ హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంపులో మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులనులను కొరికిన ఎలుకలు సంఘటన జరిగిన రెండు రోజుల అనంతరం గానీ బయటకి పొక్కకుండా హాస్టల్ అధికారులు జాగ్రత్తపడ్డారు. తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థులకు నామమాత్రపు చికిత్స చేయించి పాఠశాలలో ఉంచగా ఈ విషయం తల్లిదండ్రులకు రెండు రోజుల అనంతరం తెలవడంతో చూసేందుకు వెళ్లిన వారిని అనుమతించకపోవడం అధికారుల అతి ఘాతకానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఈ విషయాన్ని స్వర్ణోదయం డిజిటల్ పేపర్ ఆదివారం రాత్రి వెలుగులోకి తీసుకురాగా సోమవారం ఉదయం గురుకుల పాఠశాలలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. అలాగే ఆయనతోపాటు మండల విద్యాధికారి బి శ్రీనివాస్ ఇతర అధికారులు హాస్టల్ ను సందర్శించి రహస్యంగా విచారణ జరుగుతున్నారూ.. హాస్టల్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం విద్యార్థుల బట్టలు ఎక్కడపడితే అక్కడ ఆరేయగా కుప్పగా పడి ఉండడంతో దుర్వాసన రావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు విచారణకు వెళ్లిన అధికారుల ద్వారా తెలిసింది. ఈ విషయం తెలిసి మీడియా, పాత్రికేయులు అక్కడికి చేరుకోగా గేటుకు తాళం వేసి లోపలికి మీడియాను అనుమతించకుండా అధికారులు దొరుకుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. అయితే విద్యార్థులపై తరచూ ఎలుకలు దాడులు (కొరకడం) చేయడం బయటకి పొక్కకుండా జాగ్రత్త పడడం చూస్తుంటే ఇంకా సంక్షేమ హాస్టల్ ఎలాంటి అఘైత్యాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎలుకలు కరవడం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.



విద్యార్థిని పాదాలను ఎలుకలు కోరికన దృశ్యం…
—————+++++++——————-
&&పత్రికా ప్రకటనలు&&
————-++++++——————
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






