
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలుగు జాతి స్వాప్నికుడు, అభివృద్ది, శాంతి కాముకుడు, అలుపెరుగని నిత్యశ్రామికుడు, సాధకుడు, పాలనా దక్షుడు, విజనరీ నాయకుడు, రాజకీయ దురంధరుడు, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి నేటికీ 30 ఏళ్ల సందర్భంగా చంద్రబాబుకు రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. 45సంవత్సరాల రాజకీయ అనుభవం,14 ఏళ్ల ముఖ్యమంత్రి, 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడుగా, ఉన్నత విద్యావేత్త గా సమున్నత రాజకీయ వేత్త విజనరీ అపర చాణక్యుడు అనితర సాధ్యుడు రాజనీతితో ఆరితేరిన పని రాక్షసుడు, హైటెక్ ముఖ్యమంత్రి హైదరాబాద్ అభివృద్ది ప్రదాత అమరావతి రూపశిల్పి జనహితమే లక్ష్యంగా పనిచేస్తున్న సంక్షేమ సారథి తెలుగు జాతి వికాసానికి ఎనలేని సేవలందించిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు.
సెప్టెంబర్ 1న ఇదే రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఇక్కడ సమాఖ్య కార్యాలయంలో ప్రజా సంఘాలు, చంద్రబాబు అభిమానులు నిర్వహించిన సంబరాల వేడుకల్లో పోలాడి రామారావు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. రాజకీయ వారసత్వం లేదు, వేలకోట్ల కుబేరత్వం లేదు, సినిమా గ్లామర్ లేదు, గాఢ్ ఫాదర్ లేడు, అయితేనేమి క్రమశిక్షణ, కృషి పట్టుదల, వ్యూహ చాతుర్యం, దూరదృష్టితో స్వయం కృషితో చంద్రబాబును ఎదురులేని నాయకుడిని చేసిందన్నారు.
నాడు హైదరాబాదులో హైటెక్ సిటీ, జీనోమ్ వ్యాలీ, నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నమెంటుకి బాబు శ్రీకారం చుట్టి భవిష్యత్ తరాలవారికి ఆద్యుడిగా నిలిచారని రామారావు కొనియాడారు. ఐటీని విరివిగా ప్రోత్సహించి హైదరాబాద్ ను ఆధునిక పురోగమనానికి నాంది పలికి నేడు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపి తెలుగు వారి జయ కేతనాన్ని ఎగురవేయుటకు బాబు ప్రథాన భూమిక పోషించారని పోలాడి గుర్తు చేశారు. ఎవరి జీవితంలోనైనా వయసుపరంగా 75 భారమైన సంఖ్యే కానీ అమరావతి పునర్నిర్మాణం, పోలవరానికి చేసింది సంపూర్ణ రూపం, పీ 4 రూపకల్పన, ఏఐ కి కొత్త చిరునామా, క్వాంటం వ్యాలీ ఇలా అసంఖ్యాక మైన లక్ష్యాల తో ఆటుపోట్లు ఎదురైనా ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేస్తూతెలుగు జాతి అభివృద్ధికి అలుపెరుగని శ్రమిస్తున్న చంద్రబాబు కు వందనం అభివందనం అన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ కుగ్రామం నారా వారి పల్లెలో జన్మించిన బాబు చదువుకు అక్కడ ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో చదువుకొరకు చంద్రగిరికి రాను పోను 16 km అక్కడ నడిచి చదువుకున్న బాబు సెలవుల్లో తండ్రి ఖర్జూర నాయుడుతో పొలం పనికి వెళ్లి, పశువులను మేతకు తీసుకు పోయి తండ్రికి సహాయం చేసే వాడని, స్కూల్లో ఎవరికీ కష్టం వచ్చినా అండగా నిలబడడంతో టీచర్లు ముచ్చట పడిపోయి బాబును క్లాస్ లీడర్ గా చేశారన్నారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజిలో డిగ్రీ చదివేటప్పుడు విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికై క్యాంపస్ రాజకీయాల్లో బాబు చురుకైన పాత్ర పోషించారన్నారు. నారా వారి పల్లెలో సరైన రోడ్డు లేకపోవడంతో సొంతూరి ప్రజల భాగస్వామ్యంతో ఎడ్ల బండ్లతో మట్టి తెప్పించి రోడ్డు నిర్మాణం చేపట్టి బస్సు వచ్చే ఏర్పాటు చేశారని చెప్పారు.
శ్రమదానం కార్యక్రమానికి ఈ సంఘటనే స్ఫూర్తిగా నిలిచిందని పోలాడి రామారావు పేర్కొన్నారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిన అదే యూనివర్సిటీలో రీసర్చ్ స్కాలర్ గా ఉంటూనే రాజకీయాల వైపు అడుగు వేసిన బాబు తొలిసారి 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ నేటి కాంగ్రెస్ తరపున చంద్రగిరి సీటు దక్కటంతో చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో తండ్రితో బ్రతిమిలాడుకొని, మారాం చేసి, తండ్రి ఖర్జూర నాయుడు వద్ద లక్ష రూపాయలు తీసుకొని ఎన్నికల్లో విద్యార్థులతో ప్రచారం నిర్వహించి, ఓటర్లకు వ్యక్తి గతంగా ఉత్తరాలు రాసి, ఇంటింటి ప్రచారం నిర్వహించి 28 ఏళ్ల వయసులోనే తొలి సారిగా యువ ఎంఎల్ఏ గా చంద్రబాబు అసెంబ్లీకీ ఎన్నికయ్యారన్నారు.
1980- 83 మధ్య పురావస్తు, సినిమాటో గ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, చిన్న నీటిపారుదల శాఖల మంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారన్నారు. చంద్రబాబు వ్యక్తిత్వం నచ్చడంతో 1981 లో తన కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ వివాహం జరిపించారన్నారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి అఖండ విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బాబు టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారన్నారు.
ఎన్టీఆర్ చుట్టూ ఉన్న పరిస్థితులని చూశాక ఆయనకు అండగా ఉండాలని భావించి టీడీపీ లో చేరి ప్రథాన కార్యదర్శి హోదాలో చంద్రబాబు ఎన్టీఆర్ కు కుడి భుజంగా మారారన్నారు.
1984 ఆగస్ట్ లో ఎన్టీఆర్ గుండె బైపాస్ సర్జరీ కోసం అమెరికాలో ఉండగా అప్రజాస్వామికంగా నాటి కేంద్ర ప్రభుత్వం కుట్రలతో ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి భర్తరఫ్ చేయగా, ప్రతిపక్షాలతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంతో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించడంతో తిరిగి నెల రోజులకే మళ్లీ ఎన్టీఆర్ సీఎం అయ్యారన్నారు. టిడిపి టిక్కెట్ పై 1989లో కుప్పం నియోజకవర్గం నుంచి బాబు పోటీ చేసి విజయం సాధించి ఇప్పటి వరకు వరసుగా 8 సార్లు కుప్పం నియోజకవర్గం నుంచి బాబు గెలుపొందరాన్నారు. చంద్రగిరితో కలిసి మొత్తం 9 సార్లు ఎంఎల్ఏగా గెలుపొందడం విశేషమన్నారు. 1995లో టిడిపిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 1, 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి ప్రజల వద్దకే పాలన తీసుకెల్లి నిత్య శ్రామికుడిగా సంక్షేమం, అభివృద్ది సుపరిపాలనకు మారు పేరుగా చంద్రబాబు నాయుడు నిలిచారన్నారు.
శ్రమదానం, పచ్చదనం పరిశుభ్రత, జన్మభూమి, రోడ్ల విస్తరణ, డయల్ యువర్ సీఎంతో, ప్రజలతో ముఖ్యమంత్రి ముఖాముఖి లాంటి అనేక వినూత్న కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. సింగపూర్ వెళ్లి పారిశుధ్య వ్యవస్థపై లోతైన అధ్యయనం చేసి దేశంలోనే తొలిసారిగా రాత్రి పూట రోడ్లను శుభ్రం చేయడం చంద్రబాబు ప్రారంభంచారన్నారు. యువతను ఐటీ వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఓ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించి, జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని చెప్పారు. విద్యార్థులు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్ లు ప్రారంభించారన్నారు.
క్రీడలకు ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలు నిర్మించి అంతర్జాతీయంగా వేదికలుగా మార్చారన్నారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన గ్రామానికి మహిళల ఆర్థిక అభివృద్ధి డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల ద్వారా పేద మహిళల జీవితంలో సానుకూలమైన మార్పులు తెచ్ఛాయన్నారు. మహిళలకు కట్టెల పొగ పొయ్యిన బారిన నుంచి తప్పించి దీపం పథకం ప్రవేశపెట్టి గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేశారని చెప్పారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, యంత్ర పరికరాలు ఏర్పాటు చేశారని, సింగరేణి నీ లాభాల బాటలో నడిపించారన్నారు. విద్యుత్ సంస్కరణలతో మిగులు విద్యుత్ అందుబాటులో ఉంచారన్నారు.
శాసన సభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం తొలిసారి ప్రవేశపెట్టిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించిందన్నారు. 46 రకాల సేవలను ఓకె చోట అందించాలని సంకల్పించి రాష్ర్టంలో తొలిసారిగా ఈ సేవా కార్యక్రమాలు 2000 సంవత్సరంలో బాబు ప్రవేశపెట్టరాన్నారు. 2002లో 5 వెల సీట్ల తో మాదాపూర్ లో హైటెక్స్ ప్రారంభించారాన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాబు విజన్ 2020 తో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చి దిద్దారన్నారు. మైక్రో సాఫ్ట్, సైబర్ టవర్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఐఐ టీ, నర్సార్ వంటి ప్రతిష్ఠాత్మమైన విద్యా సంస్థలు జీనోమ్ వంటిదిగ్గజఫార్మా కంపెనీల ఏర్పాటులో చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని రామారావు కొనియాడారు. చంద్రబాబు కృషితో సువిశాలమైన శెంశాబాద్ అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు, ఔటఠ్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందన్నారు. అనేక ఫ్లయి ఓవర్ నిర్మాణాలు, విశాలమైన రోడ్లు ఏర్పాటు చేశారని చెప్పారు
1996లో లోకసభ ఎన్నికల్లోఏ పార్టీకి పూర్తి మెజారిటీ సాధించని నేపథ్యంలోచంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనిర్ గా దేవగౌడ, ఐ కే గుజ్రాల్ లను ప్రదానులుగా నియమించారని, ప్రధాని పదవి అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు కాదనుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దే ద్యేయంగా పనిచేశారన్నారు. ఎన్డీఏ కన్వీనర్ గా వాజపేయి ప్రభుత్వం ఏర్పాటులో. రాష్ట్ర పతి గా అబ్దుల్ కలాం ఆజాద్, దళిత స్పీకర్ గా జీ ఎం సి బాలయోగి ల నియామకంలో చంద్రబాబు నాయుడుదే కీలక భూమిక పాత్ర అని కొనియాడారు
హైదరాబాద్ లో మత కల్లోలాలను పూర్తిగా అరికట్టి, గుండాయిజాన్ని, ఫాక్షనిజాన్ని ఉక్కు పాదంతో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అణిచివేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పి శాంతి భద్రతలు కాపాడి సుస్థిర అభివృద్ధికీ చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని రామారావు పేర్కొన్నారు. నేడు మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు బాబు మద్దతు కీలకంగా మారిందన్నారు.
ఎన్నో సంక్షోభాలు పరిష్కరించే, తెలుగు జాతి జనహితమే లక్ష్యంగా పనిచేస్తున్న విజనరీ నేత యువత ఆశాకిరణం దేశం మెచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొంటూ చంద్రబాబుకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు తెలిపారు.

మాట్లాడుతున్న రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
—————+++++————————
&పత్రికా ప్రకటనలు&
————-+++++++++———————
&&వార్షికోత్సవ శుభాకాంక్షలు&&






