Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు, హుజురాబాద్ నియోజకవర్గం నాయకుడు పల్లె మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో గల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల అందరి మంచి కోరుకునే నిస్వార్ధ ప్రజా సేవకుడు పవన్ కళ్యాణ్ జన్మదినం ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, దేవుని దీవెనలతో, ప్రజల అండదండ లతో మరిన్ని విజయాలు సాధించాలాని స్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, అజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






