
– వై.ఎస్ మరణం తీరని లోటు
– వై.ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
– వృద్ధులకు పండ్లు పంపిణీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్థంతి వేడుకలను హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మహానేతను తెలుగు ప్రజలు కోల్పోవడం దురదృష్టకరమని, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందేవని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందారని, రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందాయని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎందరో పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగ రంగాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దపెద్ద ఆపరేషన్లను సైతం ఉచితంగా చేయించుకొని ప్రజలు ప్రాణాలను కాపాడుకున్నారని పేర్కొన్నారు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు సంక్షేమ పథకాలను గడప గడపకు అందిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజా పాలనను ఆదరిస్తున్నారని, రాబోయే 2028 ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎగరబోయేది కాంగ్రెస్ పార్టీ జెండా నేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సందమల్ల నరేష్, దుబాసి బాబు, బత్తిని రవిందర్ గౌడ్, సందమల్ల బాబు, కె.ఆర్ బిక్షపతి, జంగ అనిల్, రవి యాదవ్, ముక్క రవితేజ, గద్దల కార్తికేయ, వరుణ్, తిరుపతి, సాయి, శ్రీ చరణ్ పాల్గొన్నారు.

వైయస్ విగ్రహానికి పూలమాల వేస్తున్న కాంగ్రెస్ నాయకుడు చందమల్ల నరేష్…




వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, వైయస్సార్ కు నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు..





