
– రూ. లక్ష 10 వేలు ఆర్థిక చేయూత అన్ని విధాల ఆదుకుంటామని కుటుంబానికి హామీ..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మానకొండూరు మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఆరోగ్య మిత్ర గాలిపెళ్లి ఆంజనేయులు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులు, ఫీల్డ్ స్టాఫ్ డీసీలు, డిఎంలు, టీమ్ లీడర్ లు, ఆరోగ్య మిత్రాలు ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ.లక్ష 10 వేలు కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతను అందజేశారు. కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జనరల్ మేనేజర్ డా.బి నరేష్ ఆయన వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా కో ఆర్డినేటర్స్ జిల్లా మేనేజర్లు, టీం లీడర్లు, ఆరోగ్యమిత్రాలు పాల్గొన్నారు.

ఆరోగ్య మిత్ర ఆంజనేయులు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధికారులు…






