
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ (సైదాపూర్): ఓ అన్నదాతపై గుర్తుతెలియని దుండగుల పైశాచిక ఆనందానికి ఆ రైతు బోరున విలపించడం పలువురిని కలచివేసింది. పచ్చని పంటకు గడ్డి మందు కొట్టి గుర్తుతెలియని దుండగుడు పైశాచిక ఆనందం పొందగా సదరు రైతు వెంకటయ్య బోరున విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఉమ్మడి వెన్నంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన బాగోతం వెంకటయ్య అనే రైతు తనకున్న 2 ఎకరాల 25 గుంటల భూమిలో వరి సాగు చేశాడు. నాటు వేసి 20 రోజులు అవుతుంది. శుక్రవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వరి పంటలో గడ్డి మందు కొట్టారు. దీంతో పంట మొత్తం ఎండిపోయి వాల్పోయింది. పంటను చూసేందుకు వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన బాగోతం వెంకటయ్య వరిపంట ఎండిపోవడాన్ని గమనించి, ఎవరో కావాలని తన వరి పంటకు గడ్డి మందు కొట్టి పాడు చేశారని ఆయన బోరున విలపిస్తూ తెలిపారు. సుమారు 40 వేల వరకు తనకు పంట నష్టం వాటిలినట్లు తెలిపాడు. తాను గత 15 సంవత్సరాల క్రీతం మొలుగూరి లింగయ్య అనే వ్యక్తి వద్ద నుంచి రెండెకరాలనర భూమిని కొనుగోలు చేసి పట్టా చేసుకొని కాస్తూుచేస్తూ జీవిస్తున్నానని తెలిపారు. గత మూడు సంవత్సరాల నుంచి వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి రాజయ్య అతని భార్య , కుమారుడు కలసి గత సంవత్సరం పోవాకు సాగు చేయగా చెడగొట్టారని, అంతకుముందు పత్తి సాగు చేసిన పంటను చెడగొట్టారని, ఇప్పుడు వరి సాగు చేస్తే 25 గుంటల వరి పంటపై గడ్డి మందు కొట్టి పంట నాశనం చేశాడని ఆరోపించాడు. దీనిపై పలుమార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, రెవెన్యూ అధికారులు వచ్చి నేను సాగు చేస్తున్న భూమి నాదేనని చెప్పిన వినకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మొలుగూరి రాజయ్య అనే వ్యక్తి తన పంటకు గడ్డి మందు కొట్టి నాశనం చేసినట్లు రోదించాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు.



పచ్చని వరి పంటకు గడ్డి మందు కొట్టడంతో వాడిపోయి ఎండు ముఖం పట్టిన పోలాన్ని చూసి బోరున విలపిస్తున్న రైతు బాగోతం వెంకటయ్య …





