
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జామ మజీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సౌదీ అరేబియాలోని మక్కా ఉమ్రా ని దర్శించుకునేందుకు వెళ్తున్న సందర్భంగా బుధవారం ఆయన గృహంలో మైనారిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారి అయినా మక్కాకి వెళ్లి రావాలని పెద్దలు చెబుతుంటారని, దర్శనానికి వెళ్తున్న ముజాహిద్ హుస్సేన్ కు అల్లా దేవుడి కటాక్షం కలగాలని కోరుకున్నారు.
అలాగే ఈ ప్రాంతంలోని మైనారిటీ సోదరుల తరఫున కూడా అక్కడ ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న ముజాహిద్ హుస్సేన్ క్షేమంగా వెళ్లి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు మహమ్మద్ అంజదుల్లా ఖాన్, ఎండి హర్షద్, షఫీ, సల్మాన్, మున్వార్, జూబేర్, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు.

ముజాహిద్ హుస్సేన్ ను సన్మానిస్తున్న మైనార్టీ నాయకుడు అంజాదుల్లా ఖాన్…

ముజాహిద్ హుస్సేన్ ను శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సత్కరిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు..





