Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి వేడుకలు ఆదివారం చేనేత సహకార సంఘ కార్యాలయంలో సంఘం ఇంచార్జి అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎలిగేటి ఉపేందర్ మాట్లాడుతూ…చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం 1952 లో ఆప్కో ను ఏర్పాటు చేశారని, ఇతర వృత్తుల వారిని కూడా సహకార రంగ పరిధిలోకి తెచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పద్మశాలీలకు తన వంతు సేవ చేశారని బాపూజీని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సంగం ఇన్చార్జి కోశాధికారి గుండేటి మహదేవ్, చేనేత సహకార సంఘం మేనేజర్ నక్క వైకుంఠం, క్యాషియర్ మంచికట్ల కోటి, నేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






