Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హైదరాబాదులో జరిగే ఫోటో ఎక్స్పో కార్యక్రమానికి హుజురాబాద్ మండలం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం హుజురాబాద్ నుంచి బయలుదేరారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు ఎంతోమంది జీవితాలకు సంబంధించిన జ్ఞాపకాలను తమ కెమెరాల్లో బంధించి ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతారని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే శుభకార్యంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఫోటో ఎక్స్పోలో నూతన కెమెరాలను లాంచ్ చేసి కొత్త కొత్త మెలకువలకు సంబంధించిన విషయాలను ఫోటోగ్రాఫర్లకు వివరిస్తారని, హుజురాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి వెళ్లే ప్రతి ఒక్క సభ్యుడు కొత్త కొత్త మేలుకోలు నేర్చుకొని ఈ రంగంలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తలకొక్కుల హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి మధుకర్, రాష్ట్ర సభ్యుడు మాచర్ల రాజు గౌడ్ తో పాటు మిగతా సభ్యులు ఉన్నారు.

జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న కాంగ్రెస్ నేతలు..





