
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గల శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొమ్మిది రకాల పూల అలంకరణలతో బతుకమ్మను చేసి, పూజించి బతుకమ్మ ఆటపాటలతో వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థుల ఆటపాటలు ఆలరించాయి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బతుకమ్మ మరియు తెలంగాణ సాంప్రదాయ పండుగలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసారు. అలాగే మా కళాశాలలో ప్రతి సంవత్సరం ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలలో మా కళాశాల ముందుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ చదువులో క్రమశిక్షణలో సాంస్కృతిక కార్యక్రమాలలో మా కళాశాల విద్యార్థులు ముందుంటారని, సమాజ సేవలో ఎన్ఎస్ఎస్ ద్వారా అనేక సేవలందించిన ఏకైక డిగ్రీ కళాశాల తమ వాగ్దేవి డిగ్రీ కళాశాల అన్నారు. విద్యార్థులు ఇంకా వారి కలలను అభివృద్ధి చేసుకోవాలని వీటితోపాటు చదువులో కూడా ర్యాంకులు తీసుకురావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్, కళాశాల అధ్యాపకులు భద్రయ్య, రమేష్, సంపత్, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.










