Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం జూపాక గ్రామంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ బస్టాండ్ కూడలి వద్ద బుధవారం రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. విగ్రహ కమిటీ అధ్యక్షుడు గిన్నారపు మహేందర్ హాజరైన ప్రతీ ఒక్కరికి కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవ ప్రతిక అయిన జ్ఞానయోధుడి విగ్రహ ఏర్పాటులో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం పంచుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏంపీటీసి కేతిరి రాజిరెడ్డి, మాజీ సర్పంచులు చేపూరి ప్రభాకర్, ఇల్లందుల స్వరూప-శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ తాల్లపెల్లి రాజేందర్, పంజాల రాజయ్య, మాజీ వార్డు సభ్యులు పంజాల సురేందర్, రూపిరెడ్డి నిరంజన్ రెడ్డి, తాల్లపెల్లి వెంకటేష్ గౌడ్, దాసరి సదయ్య, కుల సంఘాల నాయకులు పంజాల కుమార్, చేపూరి రవి, కొంకటి ఆయిలయ్య, కుక్కల కొమురయ్య, నీలం సమ్మయ్య, ధార స్వామి, సమ్మెట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహ కమిటీ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ కుల పెద్దల సమక్షంలో శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.





