
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 25: హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధే తన ధ్యేయమని పదే పదే స్పష్టం చేస్తూ….అసెంబ్లీ వేదికగా గానీ ప్రభుత్వ స్థాయిలో గానీ నిరంతరం తన డిమాండ్లను వినిపిస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కృషికి ఫలితంగానే హుజురాబాద్ నియోజకవర్గానికి 30 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని బిఆర్ఎస్ నేతలు గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం రూ.15 కోట్లు, జమ్మికుంట మున్సిపల్ అభివృద్ధి కోసం 15 కోట్లు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బలంగా డిమాండ్ చేశారన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల నుండి పట్టణాల దాకా ఉన్న మౌళిక వసతులతో పాటు అభివృద్ధి అవసరాలను లెక్కలతో వివరించారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తన గొంతు అసెంబ్లీలో వినిపిస్తూనే ఉంటానని, ప్రభుత్వాన్ని కదిలించే వరకూ ఆగబోనని అసెంబ్లీలోనే ధైర్యంగా ప్రకటించారన్నారు. అదే పోరాటం ఇప్పుడు ఫలితాన్నిచ్చిందన్నారు. ఈ నిధుల మంజూరుతో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో నిలిచిపోయిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు వంటి కొన్ని మౌళిక సదుపాయాల పనులు వేగవంతం కానున్నాయనీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణ బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా, మాజీ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, తాజా, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ముక్క రమేష్, మక్కపెళ్లి కుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధనవర్ష రాజు, బత్తుల సమ్మయ్య, చింత శ్రీనివాస్, కల్లేపల్లి రోశెందర్, ప్రతాప కృష్ణ, గోవిందుల భాస్కర్, 30వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు, దిల్ శ్రీనివాస్, కొలిపాక రవి సోషల్ మీడియా కన్వీనర్ తులసి లక్ష్మణమూర్తి, రవీందర్, మహేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..





