
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బిజెపి సిద్ధాంత కర్త పండిత్ దీన్ దయాల్ జయంతి వేడుకలు గురువారం హుజూరాబాద్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు మాట్లాడుతూ… మానవతావాదం, అంత్యోదయ సృష్టికర్త, దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు పండిత్ దీన్ దయాల్ అని అన్నారు. తత్వవేత్త, సంఘ సంస్కర్త, ఆదర్శ కర్మయోగి, గొప్ప దార్శనికుడు, విలక్షణ ఆలోచనపరుడు, దూర దృష్టిగల రాజనీతిజ్ఞుడు, పండిత్ దీన్ దయల్ అని, ఆయన జీవితం నేటి యువతకు, నాయకులకు స్ఫూర్తిదాయకం అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణాధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యక్రమ కన్వీనర్ గంగిశెట్టి ప్రభాకర్, నాయకులు నరాల రాజశేఖర్, యాంసాని శశిధర్, తిప్పబత్తిని రాజు, మహమ్మద్ అజార్, నాంపల్లి సుమన్, తూర్పాటి రాజశేఖర్, సురేష్, పర్థం అనిల్ తదితరులు పాల్గొన్నారు.



మొక్కలు నాటుతున్న బిజెపి పట్టణ అధ్యక్షుడు రాజు..







