
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పిఆర్ సి, డిఏ లు, జిపిఎఫ్ మెడికల్ బిల్లులు సలండర్లు లీవ్‌లు పదవి విరమణ చెందిన ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావులకు విజ్ఞప్తి చేశారు. ఎవరు కూడా ఊహించని విధముగా అనేక రకాల సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్ల పథకం వివిధ రకాల సంక్షేమ పథకాలు p తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గుర్తింపు ఉన్నట్లుగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ మీరు కావాలని కోరుకొని ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేసి మన ప్రభుత్వమని గెలిపించుకున్నారన్నారు. అలాంటప్పుడు దాదాపు కొన్ని రోజుల నుండి 2వ పిఆర్సి నివేదిక పిఆర్సి కమిషన్ వద్దనే ఉందనీ, దానిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులందరూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రెండవ పిఆర్సి నివేదికను తెప్పించుకొని వెంటనే దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండోవ పిఆర్సి కానుకగా ప్రకటించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారికి విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులన్నిటిని వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వ ఖజానా ద్వారా నిధులను విడుదల చేయించి, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయించి ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల అందరూ కలిసి దసరా పండుగ మంచిగా జరుపుకున్నట్టు చేయవలసిన బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడినట్లైతే అన్ని రకాల గతంలో ఉన్న పెండింగ్ బిల్లులు అన్ని మంజూరవుతాయి అని ఎదురుచూస్తున్నారన్నారు. అలా చూడబట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కొన్ని వేల కోట్ల బిల్లులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వద్దనే పెండింగ్‌లో ఉన్నాయి కనుక ఈ పెండింగ్ బిల్లులను అన్నిటిని వెంటనే దసరా పండుగ కానుకగా మంజూరు చేసినట్లయితే చాలా బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో 204 ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఏర్పడి ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి ఎన్నో విన ఏంతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్పందన రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వం వద్ద నుండి ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు

మాట్లాడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ముజాహిద్ హుస్సేన్





