
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన వేద పండితులు, ప్రముఖ పురోహితులు బ్రహ్మశ్రీ అవధానుల దత్తాత్రేయ శర్మ (దత్తయ్య గారు) (95) ఆదివారం ఉదయం మృతి చెందారు. దత్తయ్య గారి పార్థివ దేహాన్ని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ వి సతీష్ కుమార్ హుజరాబాద్ లోని ఆయన నివాసంను సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. దత్తయ్య గారి మృతి తీరనిలోటని అన్నారు. ఆయన జిల్లా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేశారని ప్రశంసించారు.

దత్తయ్యగారి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్..





