
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:హుజురాబాద్‌కు చెందిన అవదానుల దత్తయ్యగారి పార్థివ దేహానికి హుజురాబాద్ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దత్తయ్యగారి మృతి పట్ల వారు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణానికి చెందిన అవధానుల దత్తయ్యగారి మరణం అత్యంత బాధాకరమని ఆయన మృతిపట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నామని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామనీ హుజురాబాద్ మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మజీద్ కమిటీ మాజీ అధ్యక్షులు సలీం, మహమ్మద్ నవాబ్ పాషా, మజీద్ ప్రస్తుత ఉపాధ్యక్షులు హబీబ్, మాజీ ఏఎంసి డైరెక్టర్ మొహమ్మద్ ఖాళీద్ హుస్సేన్, సీనియర్ నాయకులు ఎండి ఇమ్రాన్ (KGN), అజ్జు, సర్వర్, సాదిక్, సలీం తదితర మైనార్టీ నాయకులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

దత్తయ్యగారి మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు..





