
–ఐసిఎంఎఐ కోర్సు పూర్తిచేసిన రియాజుద్దీన్ కుమార్తె రెబాలా సయ్యద్
–రెబాలా కు అభినందనల వెల్లువ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, సెప్టెంబర్ 29: హుజురాబాద్ పట్టణంలోని మామిండ్లవాడకు చెందిన సయ్యద్ రియాజుద్దీన్ కుమార్తె రెబాలా సయ్యద్ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయిలో జరిగే “ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా” (ఐ సి ఎం ఎ ఐ) ఉత్తీర్ణురాలైంది. రెబాలా హైదరాబాదులో విద్యాభ్యాసం పూర్తి చేసింది. డిగ్రీ అనంతరం ఢిల్లీలో నాలుగేళ్ల ఐసిఎంఎఐ కోర్సు చదివింది. ఇందులో సీఎంఏ ఫౌండేషన్ కోర్స్ ఒక ఏడాది, సీఎంఏ ఇంటర్మీడియట్ ఒక ఏడాది, సీఎంఏ ఫైనల్ రెండు సంవత్సరాలు ఉంటుంది. ఈ పరీక్షలకు హాజరు కావడం అంటే సాహసం చేయడమే. ఈ పరీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ పరీక్షలో కేవలం అతి తక్కువ మంది ఉత్తీర్ణులవుతారు. అంటే పరీక్షలకు హాజరైన వారిలో కేవలం 20% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఈ అరుదైన ప్రతిష్టాత్మక కోర్సు పూర్తి చేసిన వారికి.. మల్టీ నేషనల్ కంపెనీలలో ఉన్నతమైన అవకాశాలు లభిస్తాయి. ప్రసిద్ధ కంపెనీలలో అవకాశాలు దక్కనున్నాయి. చార్టెడ్ అకౌంటెన్సీ కంటే.. అత్యున్నతమైన కోర్సుగా దీన్ని భావిస్తారు. రెబాలా రోజుకు 16 గంటలు చదివి ఐసిఎంఎఐ ఉత్తీర్ణురాలైంది. ఇటీవలే ఐసిఎంఎఐలో జరిగిన కాన్వోకేషన్ లో పట్టాను అందుకుంది. రెబాలా తండ్రి సయ్యద్ రియాజుద్దీన్ సెక్రటేరియట్ లో ఉద్యోగిగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. రెబాలా తాత, రియాజ్ తండ్రి దివంగత సయ్యద్ గౌసొద్దీన్ స్థానిక మండల పరిషత్ (పూర్వ బ్లాక్ కార్యాలయం)లో పనిచేసేవారు. అలాగే వ్యాపారవేత్తగా కూడా అందరికీ సుపరిచితులు. రెబెలా బాబాయ్ గయాసుద్దీన్ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే ఉద్యోగ విరమణ పొందారు. మరో బాబాయ్ ఫయాజ్ వ్యాపారవేత్తగా ఉన్నారు. రెబాలా పదోతరగతి వరకు హైదరాబాదు అబిడ్స్ లోని రోసరీ కాన్వెంట్ హై స్కూల్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్ నారాయణగూడ లోని తపస్యా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీలో బీకాం కోర్సు నారాయణగూడలోని వెంకటేశ్వర కామర్స్ డిగ్రీ కళాశాల పూర్తి చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఐసిఎంఎఐ పరీక్ష ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. కాగా దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలో ఐసిఎంఏఐ ఉత్తీర్ణత పొందిన రెబాలా ను హుజురాబాద్ కు చెందిన రియాజ్ మిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానిక డాక్టర్లు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారులు అభినందిస్తున్నారు.

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ ఐసి ఎంఎఐ కోర్సు ఉత్తీర్ణత సాధించి పట్టా పొందుతున్న విద్యార్థిని రెబాలా సయ్యద్

విద్యార్థిని రెబాలా సయ్యద్





