
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని చిన్నపాపయ్యపల్లె గ్రామ సమీపంలో ఉన్న సువర్ణ ఫంక్షన్ హాల్ లో హుజురాబాద్ లోని కాకతీయ ఉన్నత పాఠశాలలో (2013- 14) బ్యాచ్ చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హెడ్మాస్టర్ బద్దుల రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ…పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకొని మాతృభూమికి చదువుకున్న విద్యాసంస్థకు మంచి పేరు తీసుకురావడం వల్ల విద్య సంస్థ ప్రతిష్ట పెరుగుతుందని, సొంత ఊరికి గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి అన్నారు. పలువురు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు ఏ విధంగా ఉంటే గొప్పవారుగా మారూతారో తెలుపుతూ మార్గదర్శకత్వం ఇచ్చారు. తధానంతరం హాజరైన ఉపాధ్యాయులకు విద్యార్థులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వెంగళరావు, రాంబాబు, ఉపాధ్యాయులు పోగుల రాజయ్య, అజ్మత్ అలీ, బండారి రమేష్, శ్రీపతి కిరణ్, తిరుపతి, విద్యార్థులు మూదం మానస, పవన్, భరత్, సంతోష్ ,జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.


కాకతీయ ఉన్నత పాఠశాలలో (2013- 14) బ్యాచ్ చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం





