Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
దళిత మంత్రి అట్లూరి లక్షణ్ కుమార్ పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం హుజురాబాదులో ఆయన మాట్లాడుతూ….మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్ల అనుచిత వాక్యాలు మాట్లాడడం సరికాదని, ఇంతే కాకుండా మాదిగ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు 24 గంటలలో క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టి బొమ్మను దహనం చేస్తామని, ఆయన ఇంటిని ముట్టడిస్తాం అని వారు హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్, మోలుగురి అశోక్, కాలువ మల్లయ్య పాల్గొన్నారు

ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్, ఎంఆర్పిఎస్ నాయకులు..





