
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ :
హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో పోచమ్మ తల్లి, బొడ్రాయి, భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం దేవాలయ ప్రాంగణంలో వేద బ్రాహ్మణులు, ప్రజలు భక్తిశ్రద్ధలతో చండీయాగం, కుంకుమ పూజ నిర్వహించారు. పోచమ్మ తల్లి దేవాలయ ఐదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా దేవాలయ కమిటీ భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. వేద పండితులు డింగరి మణికంఠ పృథ్విరాజ్ భాస్కర్, కృష్ణమాచార్యులు చండీయాగం నిర్వహించడమే కాకుండా, వాటి యొక్క పరమార్థాన్ని భక్తులకు వివరించారు. పోచమ్మ తల్లి విశిష్టత గురించి కృష్ణమాచార్యులు వివరించారు. మహిళా భక్తులచే కుంకుమ పూజ నిర్వహించిన అనంతరం గ్రామంలో పోచమ్మ తల్లి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. బుధవారం బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాస్ సమ్మయ్య శంకర్, మాజీ సర్పంచులు తాటికొండ పుల్లాచారి, చందుపట్ల పరంధాములు, టాప్రా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ,సందేల వెంకన్న , జూపాక కృష్ణమూర్తి, రాజేందర్, మామిడి రమేష్, చొల్లేటి హరికిషన్, నాగరాజు, మంతెన సురేందర్, మంద సదాశివరెడ్డి, భద్రయ్య, తాటికొండ సదానందం, శ్రీనివాస, ఎలుక పల్లి మనీ, జూపాక రామన్న, తాటికొండ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేటలో ఘనంగా పోచమ్మ తల్లి ఐదవ వార్షికోత్సవ ఉత్సవాలు
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేట గ్రామంలో పోచమ్మ తల్లి, నాభి శిల, భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ నలు వీధులలో పోచమ్మ తల్లి ఊరేగింపు ఉత్సవాలను పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యులు పోచమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ పోతిరెడ్డి పేట పోచమ్మ తల్లి భక్తుల యొక్క మొరను ఆలకించి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా తెలంగాణలోనే పేరుగాంచినందున పట్నం నుండి పల్లె వరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులవుతారని పేర్కొన్నారు. పోతిరెడ్డిపేట పోచమ్మతల్లి గ్రామ ప్రజలందరితోపాటు ఆ తల్లిని అనునిత్యం దర్శించుకునే భక్తులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించునట్లు ఎల్లవేళలా ఆ తల్లి తమ దీవెనలను అందించాలని వేడుకొన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరము గ్రామ ప్రజలందరూ ఇంతకు రెట్టింపైన ఉత్సాహంతో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ గ్రామానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమములో మాజీ సర్పంచ్ చందుపట్ల పరంధాములు, సందేల వెంకన్న, జూపాక కృష్ణమూర్తి, చందుపట్ల రాజేందర్, మామిడి రమేష్, చొల్లేటి హరికిషన్, వెన్నంపల్లి నాగరాజు, బొల్లవేణి శంకర్, మంతెన సురేందర్, మంద సదాశివరెడ్డి, చెన్నోజు భద్రయ్య, తాటికొండ సదానందం, వెన్నంపల్లి శ్రీనివాస్, ఎలుకపల్లి మనీ, జూపాక రామన్నతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


పోతిరెడ్డిపేటలో చండీయాగంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..


ఈ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్..





