
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ మండలం కందుగుల గ్రామములో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యులు పడిదం బక్కారెడ్డి కుటుంబాన్ని మంగళవారం కరీంనగర్ మాజీ ఎంపీ, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించి పరామర్శించారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఒక నిబద్ధత కలిగిన గులాబీ సైనికుడిని పార్టీ కోల్పోయిందని మంచి మనిషి ప్రజల నుంచి దూరమయ్యాడని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బoడ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ టి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఇరుమల్ల రాణి- సురేందర్ రెడ్డి, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బక్కరెడ్డి భార్య ప్రభావతిరెడ్డి, కుమారులను పరామర్శిస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్..





