Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పోషణ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రోజున ఐసిడిఎస్, హుజురాబాద్ ప్రాజెక్టు పరిధి మరియు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల మూడు నుండి ఐదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డిడబ్ల్యూఓ సరస్వతి మాట్లాడుతూ…పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. శరీరానికి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు అవసరమన్నారు. ప్రతిరోజు మనం వాడుతున్న ప్లాస్టిక్ ను తగ్గించి, పర్యావరణాన్ని రక్షించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, సీజనల్ వ్యాధులు, న్యూట్రిషన్, జంక్ ఫుడ్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ లపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదేవిధంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ బాబు, ఏసిపి వి మాధవి, మునిసిపల్ కమిషనర్ కే సమ్మయ్య, సిడిపిఓ సుగుణ, ఏసిడిపిఓ ప్రవళిక, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎన్ నారాయణరెడ్డి, డాక్టర్ మౌనిక, మున్సిపాలిటీ మేనేజర్ భూపాల్ రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు పద్మ, రమ, శ్యామల, శిరీష, స్వరూప, జ్యోతి, పోషణ అభియాన్ న్ బ్లాక్ కో ఆర్డినేటర్ కె నాగరాజు, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డిడబ్ల్యుఓ సరస్వతి

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డిడబ్ల్యూవో సరస్వతి..

శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు గల పదార్థాలను ప్రదర్శిస్తున్న వాటిని పరిశీలిస్తున్న అతిథులు..

కార్యక్రమానికి వచ్చిన అతిథులతో నిర్వాహకులు…





