
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 14: 135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణి కార్యక్రమంలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడన్న నేపథ్యంలో వీఆర్ఏ పై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్ డి ఓను 15 రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్ డిఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12, 2025న అంతిమ విచారణ పూర్తి చేసినప్పటికీ, తుది నివేదిక ఇంకా సమర్పించక పోవడం బాధితుడినీ ఆవేదనకు గురిచేసింది. ఇప్పటికే 33 రోజులు గడిచిన నేపథ్యంలో, సదరు ఆర్ డిఓ పై సోమవారం మరోసారి ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు.

ఆర్డీవో పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్న బాధితుడు..





