
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్ లలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపి నాయకులపై బిఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లలో మంగళవారం పిర్యాదు చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావులు మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కౌశిక్ రెడ్డిపై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదన్నారు. ప్రజల్లో ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. మరో మారు తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో చిలుముల రామస్వామి, ఎండి జానీ, మొలుగూరి వసంత్, మంద రాజేష్, జే కే పొనగంటి శ్రీధర్ సందీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వీణవంకలో భాను చందర్, rK, యాసీన్, క్రాంతి మహేష్ సంపత్ పాల్గొనగా, హుజురాబాద్ లో కొలిపాక శ్రీను, తాళ్లపల్లి శ్రీను, కొండ్ర నరేష్, కే రోషందర్, ముక్క రమేష్, ముత్యం రాజులు పాల్గొనగా, ఇల్లంతకుంటలో మాజీ ఎంపీపీ వెంకటేష్, ఎంపీటీసీ కుమార్, ఓదెలు, రఫీ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు..

జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు..





