
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని కృష్ణవేణి హైస్కూల్లో గురువారం 108 సిబ్బంది విద్యార్థులకు సిపిఆర్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఆర్ ప్రాముఖ్యత గురించి వారు వివరించారు. సిపిఆర్ తో ఒక వ్యక్తి ప్రాణాన్ని ఏ విధంగా కాపాడవచ్చు అని చేసి చూపించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పారెడ్డి రవీందర్ రెడ్డి, 108 సిబ్బంది రాజేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి అశోక్ రెడ్డి పాల్గొన్నారు.


సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న 108 సిబ్బంది..





