
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన బందును విజయవంతం చేయాలని వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశ నిర్వహించి బంద్ ను విజయవంతం చేయడానికి కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు బందు పాటించి సహకరించాలన్నారు. కాగా ఈ బందుకు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసి నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.








