
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వాటిని ఏ విధంగా నివారించవచ్చు తెలిసి ఉండాలని హుజురాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరుగు విధానాలు దాన్ని నివారించడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు టి పవన్ కుమార్, ఎల్ ఎఫ్ నరేందర్, డిఓపి ప్రసాద్ రెడ్డి, ఫైర్ మెన్స్ శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




వివిధ రకాల విన్యాసాలు ఇస్తున్న ఫైర్ అధికారులు





