
,మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
శస్త్ర చికిత్స సమయంలో రోగిని కాపాడడంలో,
ఆధునిక వైద్యంలో మత్తు వైద్యం కీలక పాత్ర పోషిస్తుందని మత్తు వైద్య నిపుణులు డాక్టర్ నల్ల నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ‘ప్రపంచ అనస్తీషియా దినోత్సవం’ను వైద్యులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శస్త్ర చికిత్సలు అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడడంలో అనస్తీషియా నిపుణుల సేవలు అత్యంత అవసరమన్నారు. మత్తు వైద్య విధానం ఆవిష్కరణ తర్వాత శస్త్రచికిత్సల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. “అనస్తీషియా అనేది కేవలం నొప్పిని తెలియకుండా చేయడమే కాదు, క్లిష్టమైన ఆపరేషన్లలో రోగి యొక్క ప్రాణాలను కాపాడే శక్తివంతమైన సాధన ఆన్నారు. మత్తు డాక్టర్లు కేవలం ఆపరేషన్ థియేటర్‌కే పరిమితం కాకుండా ఐసీయూ, అత్యవసర విభాగాల్లోనూ క్రిటికల్ కేర్ సేవలు అందిస్తారని అన్నారు. అనంతరం పలువురు వైద్యులు డాక్టర్ నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సోమశేఖర్, తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వాతి
ఉమా, గ్లోరీనా, రెజీయన, జ్యోతి, సునీత, శివ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

మత్తు వైద్య నిపుణులు డాక్టర్ నల్ల నారాయణరెడ్డినీ సత్కరిస్తున్న వైద్య సిబ్బంది.





