
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోది మన్ కి బాత్ ప్రోగ్రామ్ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని 36వ పోలింగ్ బూత్ బిజెపి అధ్యక్షురాలు తాళ్లపల్లి దేవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన మన్ కి బాత్ వీక్షణ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ 127 వ ఎపిసోడ్లో జిఎస్టి గురించి, స్వదేశీ వస్తువుల కొనుగోలు, ఛత్ పండుగ, తెలంగాణ పోరాట యోధులు కొమరం భీమ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, గార్బేజ్ కేఫ్, వందేమాతరం 150వ వార్షికోత్సవ అంశాలపై ప్రధానంగా మాట్లాడారని తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్ మార్పుల వల్ల ఈసారి పండుగ సీజన్లో అన్ని వర్గాలకు సంతోషాన్నిచ్చాయన్నారు. గతంలో ఏప్పుడు లేనివిధంగా దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయని తెలిపారు. మోదీ ప్రభుత్వం జీఎస్టీ నీ సులభతరం చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని గంగాడి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, బిజెపి సీనియర్ నాయకులు తిప్పబత్తిని రాజు, కొలిపాక వెంకటేష్, తాళ్ళపల్లి దేవేంద్ర, మునిగంటి నాగరాజు, జంపాల సువర్ణ, తాళ్లపల్లి హరీష్, గుర్రం సంతోష్, తూర్పాటి రాజశేఖర్, మల్లెల సరిత తదితరులు పాల్గొన్నారు.


ప్రధాని మోదీ మన్ కి బాత్ వీక్షిస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బిజెపి నాయకులు..





