
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
రాష్ట్రంలో వివిధ ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా…? అని బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ…విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నప్పటికీ కళాశాల యాజమాన్యాలకు ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని అన్నారు. ప్రజా పాలనలో విద్యార్థులకు చదువులకు నిధులు లేవు కానీ, రాష్ట్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన అందాల పోటీలకు నిధులు ఎలా వచ్చాయో అని ఆయన అన్నారు.
నవంబర్ 1 లోపు బకాయిలు పడ్డ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల నిధులను విడుదల చేయాలి లేదంటే సీఎం ఇంటి ముట్టడి చేస్తాం అని ఆయన అన్నారు. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న విద్యార్థుల ఫీజులు ఎందుకు విడుదల చేయడం లేదని అన్నారు. అన్ని శాఖలు లాగానే కమిషన్లు ఇస్తేనే విద్యాశాఖ నుండి పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ ని విడుదల చేస్తాం అన్నట్టు ప్రభుత్వం విద్యార్థుల చదువుతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకెట్ విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కళాశాల యాజమాన్యాలు కాలేజీలకు తరచూ బందు పెడుతున్నారని, దీంతో పేద విద్యార్థులకు చదువులకు నష్టం వాటిల్లుతుందని క్రమంగా చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పారని అన్నారు. నవంబర్ 1వ తేదీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే బీసీ ఆజాద్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని, మంత్రులను తిరగనివ్వమని విద్యార్థులతో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

మాట్లాడుతున్న అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్ గౌడ్





