Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ఈనెల 28 నుండి 30 వరకు జిల్లాలో
మహిళలు, పిల్లలు, దివ్యాంగుల, వయో వృద్ధుల శాఖ , అలిమ్కో ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే దివ్యాంగుల, వయోవృద్దుల సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుజరాబాద్ సిడిపిఓ మరాఠీ సుగుణ అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ… ఈ శిబిరాన్నీ
జిల్లాలో తేది 28.10.2025 నుండి 30.10.2025 వరకు ఉదయం గం. 9.00ల నుండి సాయంత్రం గం. 5.00ల వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ శిబిరాలలో అలిమ్కో నుంచి వచ్చిన టెక్నిషియన్ల బృందం ఆధ్వర్యంలో శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉపకారణాలు నమోదు చేసి త్వరలోనే అందిస్తారనీ అన్నారు. అవసరమైన దివ్యాంగులు వారి ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, UDID కార్డు, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలని అన్నారు. వయో వృద్ధులలైనచో ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలను తీసుకురావాలనీ, గత 5 సంవత్సరాలలో బ్యాటరీ ట్రై సైకిల్ పొందినవారు గాని, ఇతర పరికరాలు గత 3 సంవత్సరాలలో పొందిన వారు అనర్హులు. అని అన్నారు. ఈనెల 29 బుధవారం హుజరాబాద్ ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ఈ శిబిరం జరుగునని ఆమె తెలిపారు. సహాయ ఉపకారణాలు కావలసిన దివ్యాంగులు వయో వృద్ధులు శిబిరంలో హాజరై పేరు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు

పంపిణీ చేయనున్న ఉపకరణాలు..

సిడిపిఓ సుగుణ





