
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్ డివిజన్ కి సంబంధించిన ఓపెన్ హౌస్ కార్యక్రమం హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ మాధవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే వివిధ పరికరాల గురించి అవగాహన నిర్వహించారు. అనంతరం ఏసిపి మాధవి మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ రకాల క్రైమ్ లకు సంబంధించిన అవగాహన ఏర్పాటు చేశామని అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన అవగాహనను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని అన్నారు. అలాగే పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 6 గంటలకు సైకిల్ ర్యాలీ కార్యక్రమం ఉంటుందని, హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రాజపల్లి మీదుగా హుజురాబాద్ చౌరస్తా వరకు ఉంటుందన్నారు. అలాగే ఈనెల 30న హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ సిపి గౌస్ ఆలం పాల్గొననున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ సిఐ కరుణాకర్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సిఐ రామకృష్ణ, రూరల్ సీఐ, లక్ష్మీనారాయణ, హుజురాబాద్ ఎస్సైలు యూనస్ అహ్మద్ అలీ, రాధాకృష్ణ, సైదాపూర్ ఎస్సై తిరుపతి, పోలీసు సిబ్బంది తో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

రిబ్బన్ కట్ చేసి ఓపెన్ హౌస్ ను ప్రారంభిస్తున్న ఏసిపి మాధవి..


విద్యార్థులకు పోలీసుల విధులు, ఆయుధాల పనితీరును వివరిస్తున్న ఏసీపీ మాధవి..

విద్యార్థులకు ఓపెన్ హౌస్ గురించి వివరిస్తున్న టౌన్ సిఐ కరుణాకర్.. ఆసక్తిగా తిలకిస్తున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు..





