Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పిల్లలకు వచ్చే ఎలాంటి ఆపదనైనా పరిష్కరించడానికి అవసరమైన చైల్డ్ హెల్ప్ లైన్ 1098 పట్ల శనివారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన 1098 పోస్టర్ ను ఆవిష్కరించారు. బాలికలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1098కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దుర్థన పర్వీన్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని బి.తిరుమల, ఆసియా, ఈశ్వర్ రెడ్డి, నందం, సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, సుధీర్, సోషల్ వర్కర్ రమేష్, కేసు వర్కర్స్ సాయి కిరణ్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. కాగా అనంతరం ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత కుటుంబ సభ్యులను అధికారులు కలిసి పరామర్శించారు.






