
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సమాజంలో ఆడపిల్లల జననాలను ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో భేటీ పడావో బేటి బచావో, లింగ నిర్ధారణ చట్టం అవగాహన కార్యక్రమము జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశంలో మన రాష్ట్రంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉందని పురుషులతో పోలిస్తే స్త్రీలు జననాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ప్రజలలో అవగాహన పెరగాలని ఆమె అన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురుషులకంటే ఎక్కువగా రాణిస్తున్నారని, లింగ భేదం లేకుండా సమానత్వం పాటించాలని అన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ… పిసిపిఎన్డిటి చట్టాన్ని కట్టుదిట్టంగా జిల్లాల్లో అమలు చేస్తున్నామని, లింగ నిర్ధారణ చట్టం ప్రకారం ఏదైనా స్కానింగ్ సెంటర్లలో లింగ నిద్దాన చేసి ఆడపిల్లని చెప్పి అబార్షన్ కి పాటుపడితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ…. స్కానింగ్ సెంటర్లు అందరూ డిఆర్ఏ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ మాత శిశు సంరక్షణ అధికారిని డాక్టర్ సన జవేరియా మాట్లాడుతూ.. పిసిపిఎన్ డిటి చట్టాన్ని పాటించని స్కానింగ్ సెంటర్లను ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, చేల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధుకర్, డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ తులసి దాస్, ఏసిడిపిఓ ప్రవళిక, లత, డిసిపిఓ పర్వీన్, రమేష్ పద్మ తదితరులు పాల్గొన్నారు.









