
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హన్మకొండ : హన్మకొండ జిల్లా కేంద్రంలోని భీమారంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు విడుదల చేయాలనీ కోరుతూ బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్, బీసీ అజాది ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంజాల రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బకాయి ఉన్న 8వేల కోట్ల ఫీజు రియంబర్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కమీషన్ల కోసం కాంట్రాక్టు వాళ్ళకు బిల్లులను విడుదల చేసింది కానీ 20లక్షల పైచిలుకు చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్ బిల్లులు విడుదల చేయడం లేదు అన్నారు. దీని వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉన్నత చదువులు కోసం వెళ్ళడానికి కాలేజీ యజమాన్యాలు విద్యార్థులను ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తం అని చెప్పడంతో
విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆస్తులను తాకట్టు పెట్టి సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. చరిత్రలో మొదటిసారి కాలేజీ యజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయడం సిగ్గుచేటు అని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే రోజుల్లో బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థిని కదిలించి సచివాలయన్ని ముట్టడి చేస్తాం అని పేర్కొన్నారు. ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేసే వరకు మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముధుసూదన్ రాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి లక్ష్మణ్ రావు, జిల్లా అధ్యక్షులు మనోహర్, విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి, మండల అధ్యక్షులు శివకుమార్, కుమారస్వామి, సుమంత్, శ్రీపతి, సాయికుమార్, కమిటీ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు..



ర్యాలీగా తరలివస్తున్న బీసీ ఆజాది స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు..

ధర్నా నిర్వహిస్తున్న బీసీ ఆజాద్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు..





