Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, ఇలా అయితే సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట తప్పదని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంపల్లి ఆదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల లో జరిగిన టి టి యు సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
ఉపాధ్యాయులు, విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం తక్షణంపరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నా,వారి హక్కులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై సీరియస్గా స్పందించాలి” అని అన్నారు. పెండింగ్లో ఉన్న డి.ఏ.లు , పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉపాధ్యాయుల బెనిఫిట్స్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు గంప చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఈశ్వరయ్య, నాయకులు దానంపల్లి శ్రీనివాస్, యం రాజేందర్, తాళ్ల తిరుపతి, రావుల రమేష్, పత్తెం శ్రీనివాస్, తిరుపతి, దేవోజు నాగరాజు, వేణుగోపాల్, పొద్దుటూరి కిషన్ రెడ్డి, రాజయ్య, సాదుల విజయలత, జి.రాధిక, వి.స్వర్ణలత దేవి, యస్.రాజేందర్, యం.సుధాకర్, గుజ్జ ప్రదీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






