
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణ శివారులోని సీసీ క్యాంపు కెనాల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ కు తీవ్ర గాయాలయ్యాయి. హుజురాబాద్ డివిజన్ హెల్త్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్న పంజాల ప్రతాప్ గౌడ్ తన స్కూటీ వాహనంపై హనుమకొండకు వెళుతుండగా కెసి క్యాంపు వద్ద ఎదురుగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ అతివేగంగా జాగ్రత్తగా వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ డీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్..

ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రతాప్ ను హన్మకొండకు పంపిస్తున్న పోలీసులు..





