Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని సిరసపల్లి క్రాస్ రోడ్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే…హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన నందిపేట హర్షిత్(18), దాట్ల ప్రశాంత్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ కు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. వెంటనే స్థానికులు గాయపడ్డ వారిని హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడ్డ హర్షిత్ ను మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందగా ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా మృతుడి తండ్రి శ్రీనివాస్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మృతి చెందిన నందిపేట హర్షిత్(18)





