
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా డబ్ల్యూజెఐ జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా నూతన కమిటీనీ రాష్ట్ర నాయకులు తాడూరీ కరుణాకర్ అధ్యక్షత కమిటీ నియామకం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ ముఖ్య అధ్యక్షులుగా హాజరయ్యారు. జమ్మికుంటకు చెందిన కొంగల కుమార్ డబ్ల్యూజెఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. జర్నలిస్ట్ సమస్యలపై నిరంతరంగా పోరాడుతూ చైతన్యం పెంచుతూ ముందుకు సాగుతున్న కుమార్‌కు ఈ బాధ్యత రావడం నాయకత్వానికి ప్రతిఫలంగా నిలిచింది.
ప్రభుత్వానికి, ప్రజల వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు నిరంతరం నిజాన్ని నిర్ణయంగా రాస్తూ వారి పరిష్కారం చురుగ్గా నిలిచిన కుమార్‌కి జిల్లాస్థాయి గుర్తింపు, ఆయన నియామకానికి కృషి చేసిన జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) సీనియర్ జర్నలిస్ట్ నర్సిని కేదారి, గౌరవ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రమోద్, అనిల్ దేశాయ్, సత్యనారాయణ, జిల్లాలోనీ అన్ని మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.

డబ్ల్యూజెఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కొంగల కుమార్ ను సత్కరిస్తున్న రాష్ట నాయకులు





