
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: నమ్మిన సిద్ధాంతాల కోసం టిడిపి పటిష్టత కోసం ఆగయ్య 40ఏళ్లుగా అంకితభావంతో చేసిన సేవలు చిరస్మరణీయమని ఆగయ్య సేవలు కార్యకర్తలకు స్ఫూర్తి దాయకం ఆగయ్య మృతి ఆయన అభిమానులకు, టీడీపికి తీరని లోటని రైతు ప్రజాసంఘాల నాయకుడు, ఉమ్మడి జిల్లా టీడీపీ మాజీ సీనియర్ నాయకుడు పోలాడి రామారావు అన్నారు.
సోమవారం కరీంనగర్ పట్టణ కాపువాడలోని ఆగయ్య నివాసంలో పార్థీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి పోలాడి రామారావు ఘనంగా నివాళులర్పించారు. ఆగయ్య కుమార్తెలు తారక రమ, నవత, నందిని, కుమారుడు నరేష్ లను ఇతర కుటుంబ సభ్యులను నాయకులతో కలిసి పోలాడి రామారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపీ ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఆగయ్య కరీంనగర్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలతో కలిసి నిరంతర పోరాటాలు చేస్తూ సామాన్యులకు అందుబాటులో ఉండే ఆగయ్య మృతి బాధాకరమని, మంచి ఆత్మీయ మిత్రుడిని కోల్పోయామని పోలాడి విచారం వ్యక్తం చేస్తూ ఆగయ్యతో టీడీపీ లో కలిసి పనిచేసిన గత స్మృతులను రామారావు గుర్తు చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.


ఆగయ్య మృత దేహంపై పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సీనియర్ టిడిపి నాయకుడు పోలాడి రామారావు…

ఆగయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పోలాడి రామారావు..





