
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితాల్లో ఉండే యువత తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, యోగాతో ఒత్తిడిని జేయిస్తారని హెల్ప్ ప్రోగ్రామ్ జోనల్ కోఆర్డినేటర్ వెంకటరమణ, హుజురాబాద్ ప్రాంత కోఆర్డినేటర్ ఎల్ శ్రీనివాస్ లు అన్నారు. సోమవారం హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పి.ప్రసాద్ అధ్యక్షతన హార్ట్ ఫుల్ నెస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్స్ పొటెన్షియల్ (హెల్ప్) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….విద్యార్థిని విద్యార్థులకు రోజు వారి కార్యక్రమాలు, ఆహారపదార్థాలు, కూరగాయలు ఏవిధంగా కలుషితం అవుచున్నాయి అని అన్నారు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు అనేక ఒత్తిడిలకు విద్యార్థులు గురవుతారని, వీటిని తగ్గించు కోవాలంటే ప్రతీ ఒక్కరూ కూడా కనీసం ఒక గంటసేపు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టీ ధ్యానం, యోగా, చేస్తూ ఆరోగ్య సంరక్షణ సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పి.ప్రసాద్ మాట్లాడుతూ దేశం బాగుపడాలి అంటే కేవలం ఆర్థికంగా ఎదగడమే కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందినట్లు అని అన్నారు. కళాశాల స్టూడెంట్స్ కౌన్సిలర్ టి.రాజేశం, కళాశాల అధ్యాపకులు సుగుణ, శైలజ, జ్యోతి, విజేందర్ రెడ్డి, వాసుదేవారావు, బి రాజశేఖర్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హెల్ప్ ప్రోగ్రామ్ జోనల్ కోఆర్డినేటర్ వెంకటరమణ







