
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు చొల్లేటి కిషన్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కిషన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని వారి కుటుంబ సభ్యులతో కౌశిక్ రెడ్డి పంచుకున్నారు. కిషన్ రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని వ్యక్తిగతంగా తనకెంతో ఆయనతో అనుబంధం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు బిఆర్ఎస్. నాయకులు కార్యకర్తలు ఉన్నారు.


కిషన్ రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, నాయకులు..


కిషన్ రెడ్డి కుమారులను ఓదార్చుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..


కిషన్ రెడ్డి సతీమణి లావణ్య ను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..






