
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ నవంబర్ 17: మాజీ ఎంపీ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పలువురు రాజకీయ ప్రముఖులు కెప్టెన్ కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు కెప్టెన్ కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ తదితరులు కెప్టెన్ నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ కిట్స్, సింగాపూర్ కిట్స్, వరంగల్ పబ్లిక్ స్కూల్ అధ్యాపకులు సిబ్బంది కెప్టెన్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను ఘనంగా సన్మానించారు హుజురాబాద్ హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కెప్టెన్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హుజురాబాద్ లో బిఆర్ ఎస్ నేతలు కొలిపాక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాసుల ఆధ్వర్యంలో కెప్టెన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. హుస్నాబాద్ బిఆర్ ఎస్ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, పెద్ది శ్రీనివాసరెడ్డి, గవ్వ వంశీధర్ రెడ్డి, కొప్పూరు నాగిరెడ్డి, పోచమల్లు, న్యాయవాదులు అఫ్రోజ్, దీకొండ ప్రవీణ్, రామకృష్ణ, హుజురాబాద్ క్లబ్ సభ్యులు ఎర్రం నారాయణరెడ్డి, పెండెం శ్రీనివాసరావు, జబ్బార్, మహాకళ వీరసేనారెడ్డి తదితరులు కెప్టెన్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




హుజురాబాద్ లో జన్మదిన వేడుకలు చేస్తున్న నాయకులు…





