
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన జరిగే కలెక్టరేట్ వద్ద ధర్నాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్ల ముకుంద రెడ్డి పిలుపునిచ్చారు.
హుజురాబాద్ సిఐటియు కార్యాలయంలో కొప్పుల శంకర్ అధ్యక్షతన ఈరోజు జరిగిన మండల రైతు, వ్యవసాయ కార్మిక, CITU సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న, రైతు వ్యతిరేక విధానాలకు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత స్థాయిలో జరుగుతున్న ఐక్య పోరాటాలలో భాగంగా, ఈనెల 26వ తేదీన కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున కార్మికులు తరలిరావాలని కోరారు. ఒకపక్క దేశంలో రైతు నల్ల వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ వ్యవసాయాన్ని మొత్తం కార్పోరేట్ శక్తులకు అప్పజెప్తే కుట్రలో భాగంగానే, అలాగే కార్మిక హక్కులను కాలరాసేందుకు 29 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లుగా చేసి, ఎనిమిది గంటల పని దినాన్ని 10 గంటలు పెంచుతూ పెట్టుబడిదారులకు శ్రమ దోపిడికి గురి చేసే విధంగా కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికుల పోట్టగొడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో నిరుపేద కార్మికుల కొనుగోలు శక్తి పెంచేందుకు 100 రోజుల పని గ్యారంటీ ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి దానిని నిర్వీర్యం చేసే కుట్రలు, పన్నుతుందని అన్నారు. అలాగే వాళ్ళ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ఉపాధి కోల్పోయి, రోజు రోజుకు పేదలు మరింత పేదలుగా తయారవుతున్నారని, ధనవంతులు మరింత ధనవంతులుగా తయారవుతున్నారని ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా అనుకూల విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుండేటి వాసుదేవ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, కోశాధికారి రాజేశం, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్, కొంకట చంద్రయ్య, సారయ్య, కుమార్, రత్నాకర్, మహేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి






