
– స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం.
– రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ.
– గతంలో కంటే మెరుగ్గా ఇందిరమ్మ చీరల పంపిణీ..
– ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ కు భయం పట్టుకుంది.
– కౌశిక్ రెడ్డే పెద్ద లంగ,ఎమ్మెల్సి గా విప్ గా హుజూరాబాద్ అభివృద్ధికి ఏం నిధులు తీసుకొచ్చావో చర్చకు సిద్ధమా?
– సీఎం రేవంత్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డికి భయం,అందుకే సీఎం ఫోటో లేకుండా చెక్కుల పంపిణీ.
– మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం హిందుత్వమా?.బండికి సూటి ప్రశ్న వేసిన ప్రణవ్?
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తీర్పు తెలంగాణ పల్లెల్లో మరోసారి రాబోతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం నాడు హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతానికంటే భిన్నంగా ఈసారి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని దాంట్లో భాగంగా 18ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ ఇందిరాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు పంపిణీ చేస్తున్నామని, వాటిని తీసుకున్న మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఇలాంటి నాణ్యమైన చీరలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా బడ్జెట్ కి అనుగుణంగా నిధులు ఒక్కో రంగానికి కేటాయిస్తున్నామని దాంట్లో భాగంగానే శుక్రవారం నాడు సన్నవడ్లు పండించిన రైతులకి బోనస్ కోసం 200 కోట్ల నిధులు విడుదల చేశామని ఇది రైతు ప్రభుత్వం అని మరోసారి రుజువైందని అన్నారు. దాంతోపాటు మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధరపై సబ్సిడీ కోసం 60కోట్ల నిధులు, ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం 220 కోట్ల నిధులు మంజూరు చేశామని మొత్తంగా రూ.480 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు.
కౌశిక్ రెడ్డే పెద్ద లంగ,అందుకే హుజూరాబాద్ పరువు తీస్తున్నాడు.ఎమ్మెల్సీ గా విప్ గా హుజూరాబాద్ అభివృద్ధికి ఏం చేశావో చర్చకు సిద్ధమా?
కౌశిక్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేసీఆర్ ఇంట్లోకెళ్లి, కౌశిక్ రెడ్డి ఇంట్లోకెళ్లి చెక్కులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచే క్రమంలో ప్రోటోకాల్ గురించి నీతులు చెప్పే కౌశిక్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ లేకుండా పంచడం ప్రోటోకాల్ ఆ అని ప్రశ్నించారు? సీఎం రేవంత్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డికి భయమని అందుకే ఫోటో పెట్టడానికి కూడా వెనుకడుగు వేస్తున్నాడని అన్నారు.మాట్లాడితే కేసులు పెడుతున్నారని చెప్పే కౌశిక్ రెడ్డి తనపై ఉన్న కేసులు ఏ రకంగా పెట్టారో ఆలోచించుకోవాలని, అధికారులను బెదిరించడం, మీడియా వారిని కొట్టడం,గవర్నర్ ని తిట్టడం,పోలీస్ స్టేషన్ పై బాంబులేస్తా అని బెదిరించడం, ఇసుక వ్యాపారులను బెదిరించడం,క్వారీ వ్యాపారిని బెదిరించడం ఇలాంటి చర్యల వల్ల పోలీసులు చట్టప్రకారంగా కేసులు చేస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే అంటే ఛి కౌశిక్ రెడ్డా మీ ఎమ్మెల్యే అనే స్థాయికి తీసుకువచ్చావని జనం అనుకుంటున్నారని ఆరోపించారు. ఇకనైన ప్రజలకు సేవ చేయాలని కోరారు.
లొట్టపీసు కేసులో కేటీఆర్ కు ఎందుకంత భయం..
కేసుల విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పైకి కేసులంటే భయం లేదు అని చెప్తూనే లోలోపల తెగ హైరానా పడుతున్నారని,ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ప్రభుత్వ అనుమతి లేకుండా క్యాబినెట్ నిర్ణయం లేకుండా సొంతంగా 50 కోట్ల పైచిలుకు ధనాన్ని పంపడం చట్టవిరుద్ధం కాదా అని ప్రశ్నించారు.ఇదే కేసులో కేటీఆర్ విచారణకు హాజరైనప్పుడు లొట్టపీస్ అని అభివర్ణించాడని ఇప్పుడు గవర్నర్ కేసుకు అనుమతిస్తే ఎందుకు భయపడుతున్నారని అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కీముల పేరిట అతిపెద్ద స్కాములు చేశారని వాటి స్కాములు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఇప్పుడు భయపడుతున్నారని అన్నారు.
బండి,ఈటెల అభివృద్ధికి సహకరించండి..ప్రణవ్..
బీజేపీ నాయకులు బండి సంజయ్,ఈటెల రాజేందర్ ఒకరినొకరు మాట్లాడుకోవడం కాదని హుజూరాబాద్ అభివృద్ధికి సహకరించాలని ప్రణవ్ కోరారు.రైతుల విషయంలో బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని చిత్తశుద్ధి ఉన్న పార్టీగా బోనస్ ఇచ్చామని అన్నారు.ఇద్దరు ఎంపీలుగా ఉండి హుజూరాబాద్ అభివృద్ధికి ఏం చేశారో తెలుపాలని,మతం పేరు చెప్పి రాజకీయాలు చేయడం కాదని దేవుడంటే అందరికి భక్తి అని అన్నారు.బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి వర్గం,సుమారు 100 మంది ఎంపీలు మద్దతు పలుకగా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలు మాత్రం సహకరించట్లేదని అన్నారు.ఇది బీజేపీ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం,ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ వైపు ఉంది..ప్రణవ్..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు.గ్రామాల్లో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు,సన్న బియ్యం,రేషన్ కార్డులు,200 యూనిట్ల ఉచిత విద్యుత్,రుణమాఫీ,సన్న వడ్లకు బోనస్,9 వేల కోట్ల రైతు భరోసా,ఆరోగ్య శ్రీ 10లక్షలకు పెంపు,అభివృద్ధి పథకాలు ప్రజా ఆశీర్వాదం పొందాయి అన్నారు.గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్న మహిళల కళ్ళల్లో ఆనందం వెళ్లివిరుస్తుందని ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని మరోసారి రుజువైందని అన్నారు.కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేసి హుజూరాబాద్ నుండి అధిక సర్పంచ్ స్థానాలు గెలిచేలా కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.





విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్





