Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: హనుమకొండ జిల్లా శాలివాహన కుమ్మరి సంఘం నూతన అధ్యక్షుడిగా కమలాపూర్ మండలం దేశరాజుపల్లికి చెందిన ఇజ్జగిరి దేవేందర్ ప్రజాపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. దేవేందర్ ప్రజాపతి కుమ్మరి సమాజ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజాపతి తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇజ్జగిరి దేవేందర్ ప్రజాపతి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి, రాష్ట్ర గౌరవ సలహాదారులు, తొలి రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస ప్రజాపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉరిటి వెంకట్రావు ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి లెలిజాల పావని ప్రజాపతులకు, నాయకులకు, కుల బాంధవులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందికొండ వేణుగోపాల్ ప్రజాపతి, రాష్ట్ర నాయకులు ఆవునూరి రామ్మూర్తి ప్రజాపతి, కుమ్మరి యాదగిరి ప్రజాపతి, నాంపల్లి ప్రభాకర్ ప్రజాపతి, నేదునూరి రాజేందర్ ప్రజాపతి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రుద్రారపు కుమారస్వామి ప్రజాపతి, వేములపల్లి కవిత ప్రజాపతి, లింగాల చిత్తరంజన్ ప్రజాపతి, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఇజ్జగిరి దేవేందర్ ప్రజాపతికి నియామక పత్రం అందజేస్తున్న తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి





