Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలొ ఇటీవలే ఆర్థిక ఇబ్బందుల సోమల్ల హరీష్ ఆత్మహత్యాయత్నం చేసుకోనీ చనిపోవడం జరిగింది. ఈరోజు మిత్రుడు పల్లెర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పదో తరగతి బ్యాచ్ మిత్రులు సహకారంతో స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి మనో ధైర్యాన్నీ నింపి, వారికి మా వంతు సహాయంగా 26,000/-వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పదవ తరగతి మిత్రులు బొమ్మిదేని అజయ్, కనుమల్ల వెంకటేష్, కుర్రి అభిషేక్, బుర్ర వంశీ, విద్యార్థి నాయకులు సింగిరెడ్డి రంజిత్ రెడ్డి, గట్టు సాయిరాం, సందీప్ పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న మిత్రులు..





