
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల భూటాన్ దేశ రాజధాని థింఫులో జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో భారతదేశం తరఫున 35 సంవత్సరాల విభాగంలో పాల్గొని దేశానికి బంగారు పతకం సాధించిన హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుపుల రఘును ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడాభిమానులు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…మన దేశం ఖ్యాతిని అథ్లెటిక్స్ లో విశ్వవ్యాప్తం చేసిన రఘు అభినందనీయుడని, రఘు ఇతర క్రీడాకారులకు ఆదర్శప్రాయుడని అన్నారు. ఆయన మరిన్ని పోటీలలో పాల్గొని మన దేశానికి తిరిగి పథకాలు తీసుకొని రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ క్లబ్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ కొన్ని రాజిరెడ్డి, డాక్టర్ చంద్రమౌళి, జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జైపాల్ రెడ్డి, వేల్పుల రత్నం పాక సతీష్, కట్కూరి మల్లారెడ్డి, వెంకట రాజo, భీమోజు సదానందం, ప్రతాపరెడ్డి రామ్ రాజేశ్వర్ అంబాల మధు, ఉప్పు శ్రీనివాస్, సాయి, ప్రకాష్, పంజాల శ్రీధర్, కరాటే మాస్టర్ ఎస్ కే జలీల్, సాదుల శ్యామ్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, ఎర్ర రాజు, మహిపాల్, కోటిలింగం, నరెడ్ల రాజా లింగరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ అథ్లెటిక్స్ క్రీడాకారుడు వంతడుపుల రగున్న సన్మానిస్తున్న పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, వాకర్స్..





