
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్లో ఆదివారం రాత్రి రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో హీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని రావులు సందడి చేశారు. హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా హుజురాబాద్ అన్నపూర్ణ థియేటర్లో సినిమా నిర్మాత వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి, దర్శకుడు సాయిలు కంపాల, నేపథ్య గాయకుడు మిట్టపల్లి సురేందర్ లతోపాటు పలువురు నటులు ప్రేక్షకులతో కలిసి కొంతసేపు సినిమా చూశారు. వారిని గుర్తించిన ప్రేక్షకులు ఆనందంతో నృత్యాలు చేయగా హీరో అఖిల్ రాజ్ సైతం వారితో నృత్యం చేశాడు. హీరో అఖిల్ రాజు, హీరోయిన్ తేజస్వినిరావుతో చాలామంది ప్రేక్షకులు ఫోటోలు దిగారు. ఒక్కసారిగా సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు థియేటర్లో ఉన్నారని తెలియగానే ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ప్రాంతం మొత్తం జన సమూహంతో నిండిపోయింది.

అభిమానులకు అభివాదం చేస్తున్న సినీ డైరెక్టర్, హీరోని..

హీరో అఖిల్ రాజుతో అభిమాని, సీనియర్ పాత్రికేయుడు కిరణ్ కుమార్..





