
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని రంగపేట గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నేత కీశే. ముద్దసాని దామోదర్ రెడ్డి ప్రియ శిష్యుడు గోప్ రాజిరెడ్డి మరణం బాధాకరం అని విచారం వ్యక్తం చేస్తూ టీడీపీకి రాజిరెడ్డి చేసిన సేవలు మరువలేనివని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పోలాడి రామారావు అన్నారు. అనారోగ్య సమస్యలతో రాజిరెడ్డి సోమవారం మృతి చెందగా మానకొండూర్ మండల రంగపేట గ్రామంలోని వారి నివాసంలో మృతుని పార్థీవదేహంపై నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతుని కుమారులు అంజిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇతర
కుటుంబ సభ్యులను పోలాడి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ వీరాభిమానిగా మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి అనుచరుడిగా మండల తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేసి తన స్వంత ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చేసి రంగపేట గ్రామ పార్టీ అధ్యక్షుడుగా, మండల రైతు ప్రజాసంఘాల నాయకుడిగా రాజిరెడ్డి చేసిన సేవలు మరువలేనివని ఒక మంచి ఆత్మీయ మిత్రుడిని, మండల రైతు బాందవ్యుడిని కోల్పోయామని పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. రాజిరెడ్డి అంత్యక్రియల్లో రామారావు పాల్గొన్నారు. రామారావుతో పాటు రామంచ గోపాల్ రెడ్డి, గోప్ సత్యనారాయణరెడ్డి, కొండ్ర సంపత్ కుమార్, గోపాల్ రెడ్డి, చెరుకు మల్లా రెడ్డి, మర్రి రాజిరెడ్డి, మందల బక్కారెడ్డి, ఎడ్ల కనుకారెడ్డి, ఆనందరెడ్డి, రవీందర్ రెడ్డి, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.



మృతుడు గోపూ రాజిరెడ్డి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పిస్తున్న పోలాడి రామారావు..

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పోలాడి రామారావు..





